Zodiacs : మనం జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటాం. ద్వాదశ రాశులకు నక్షత్ర పరంగా రాశి ఫలితాలు చెబుతుంటారు. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల వారి జాతకం ప్రకారం వారికి లభించే శుభ, అశుభ యోగాలు ఉంటాయని చెబుతారు. పంచాంగంలో ఈ రాశుల వారి ఫలితాలు తెలుస్తుంటాయి. ఇప్పుడు ఐదు దశాబ్దాల తరువాత నాలుగు రాశుల వారికి కేదార్ రాజయోగం వల్ల వారికి మంచి శుభాలు కలగనున్నాయి. వారి భవిష్యత్ బంగారుమయం అవుతుందని సెలవిస్తున్నారు.

సింహరాశి
ఏప్రిల్ 23 తరువాత వీరికి అన్ని శుభాలే కలుగుతున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు దక్కనున్నాయి. ఆదాయం భారీగా పెరగనుంది. ఉద్యోగంలో మార్పులు కూడా కలిగేందుకు ఆస్కారాలు మెండుగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందనున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మేష రాశి వారికి..
మేష రాశి వారికి అన్ని రకాలుగా మేలు కలుగుతుంది. శుక్రుడు రెండో ఇంట్లో ఉండటంతో అంగారకుడు, చంద్రుడు మూడో ఇంట్లో, శని ఆదాయాలు సమకూరుస్తున్నాడు. దీంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వీరి మాటకు ఎదురుండదు. మంచి లాభాలు అందుకుని మంచి స్థాయికి చేరుకుంటారు.

ధనస్సు రాశి
జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి. పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రావడానికి కారణమవుతుంది. చేసే పనులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మంచి అనుకూల సమయం. అద్భుతంగా గడుస్తుంది. షేర్ మార్కెట్ లో మంచి లాభాలు గడిస్తారు.

మకర రాశి
ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ధైర్యం పెరుగుతుంది. ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు. దీంతో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాశుల వారికి అన్ని రకాలుగా లాభాలు కలిగేందుకు కేదార్ రాజ యోగం అద్భుతంగా సాయపడనుంది.