https://oktelugu.com/

Marriage Loan: పెళ్లి చేసుకుంటానంటే రూ.25 లక్షల లోన్.. ఇంకెందుకు ఆలస్యం?

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. జీవితంలో ఈ రెండు కార్యక్రమాలు ఎలాంటి అప్పు లేకుండా పూర్తి చేస్తే ఆ వ్యక్తి గొప్పోడు అనుకోవచ్చు. ఎందుకంటే వీటికి అయ్యే ఖర్చు నేటి కాలంలో అయితే లక్షల్లోనే ఉంటుంది.

Written By: Srinivas, Updated On : September 6, 2023 2:44 pm
Marriage Loan

Marriage Loan

Follow us on

Marriage Loan: ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నామంటే లోన్ ఇస్తారు.. పంట పండిస్తున్నామంటే రుణం ఇస్తారు.. కానీ పెళ్లి చేసుకుంటున్నామంటే కూడా లోన్ ఇస్తారంటే నమ్ముతారా? అవును పెళ్లి చేసుకోవడానికి అయ్యే ఖర్చును రుణ రూపంగా ఇచ్చి ఈఎంఐ ద్వారా స్వీకరిస్తారు. అంతేకాకుండా మినిమం టెన్యూర్ కు అయితే 0 వడ్డీ.. కాస్త ఎక్కువైతే 1 శాతం వడ్డీని మాత్రమే విధిస్తారు. దీనికి ఫలానా వారు మాత్రమే అర్హులు అని కాదు. ఎవరైనా తీసుకోవచ్చు. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? వెంటనే కిందికి వెళ్లండి..

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. జీవితంలో ఈ రెండు కార్యక్రమాలు ఎలాంటి అప్పు లేకుండా పూర్తి చేస్తే ఆ వ్యక్తి గొప్పోడు అనుకోవచ్చు. ఎందుకంటే వీటికి అయ్యే ఖర్చు నేటి కాలంలో అయితే లక్షల్లోనే ఉంటుంది. కొంచెం హై ఫై గా చేసుకోవాలనుకుంటే కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక పెళ్లి గురించి మాట్లాడితే మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా రిచ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అప్పులు చేసి మరీ పెళ్లిని గ్రాండ్ గా చేసి పది మందిలో గొప్పగా ఉండాలని అనుకుంటున్నారు.

అయితే ఒక్కోసారి పెళ్లి సడెన్లీగా నిశ్చయమవుతుంది. ఈ సమయంలో ఒకేసారి లక్షల కొద్దీ డబ్బు ఇవ్వాలంటే ఎవరూ ముందుకు రారు. ముఖ్యంగా కొందరు రిచ్ గా వివాహం చేసుకునేందుకు స్టార్ హోటల్ ను బుక్ చేయాలని కలలు కంటారు. కానీ పెళ్లికి అయ్యే బడ్జెట్ మాత్రం చేతిలో ఉండదు. బ్యాంకులో కెళ్లి పెళ్లి చేసుకుంటానంటే రుణం ఎవరూ ఇవ్వరు. తెలిసిన వాళ్లు లక్షల కొద్దీ అప్పులుఇచ్చే పరిస్థితి ఇప్పుడులేదు.

ఇలాంటి సమయంలో కొన్ని హోటల్స్ లో పెళ్లి చేసుకునే వాళ్లకు లోన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వీరు స్టార్ హోటళ్లలో గొప్పగా పెళ్లి చేసుకున్న తరువాత అయిన ఖర్చునే ఒకేసారి కాకుండా లోన్ రూపంగా మార్చుకొని ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. ఈ మొత్తాన్ని 6 నెలల్లో చెల్లిస్తే ఎటువంటి వడ్డీ విధించరు. సంవత్సరం టెన్యూర్ పెట్టుకుంటే 1 శాతం వడ్డీ విధిస్తారు. దీనినే MNPL (Marry Now Pay Later) అని అంటారు. అంటే ముందు పెళ్లి చేసుకొని ఆ తరువాత చెల్లించండి అని అర్థం. Raddison Blue అనే హోటల్ వాళ్లకి పెళ్లి అని చెప్పగానే వెంటనే వారు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు.