Da Arrears: ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు.. ఖాతాల్లోకి ఏకంగా రూ.2 లక్షలు?

Da Arrears: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు తీపికబురు అందించనుందని సమాచారం అందుతోంది. ఉద్యోగులకు అరియర్స్ చెల్లించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఉద్యోగులకు కేంద్రం అరియర్స్ ను చెల్లించడం ద్వారా ఏకంగా ఉద్యోగుల ఖాతాలలో 2 లక్షల రూపాయలకు అటూఇటుగా జమయ్యే అవకాశాలు అయితే ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. గతంలో కేంద్రం డీఏ అరియర్స్ ఉండవని వెల్లడించినా […]

Written By: Navya, Updated On : February 4, 2022 5:51 pm
Follow us on

Da Arrears: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు తీపికబురు అందించనుందని సమాచారం అందుతోంది. ఉద్యోగులకు అరియర్స్ చెల్లించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఉద్యోగులకు కేంద్రం అరియర్స్ ను చెల్లించడం ద్వారా ఏకంగా ఉద్యోగుల ఖాతాలలో 2 లక్షల రూపాయలకు అటూఇటుగా జమయ్యే అవకాశాలు అయితే ఉండవచ్చని తెలుస్తోంది.

అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. గతంలో కేంద్రం డీఏ అరియర్స్ ఉండవని వెల్లడించినా ఉద్యోగుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం అరియర్స్ ను చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. లెవెల్ 14 ఉద్యోగులకు 2,18,000 రూపాయల వరకు ఖాతాలలో జమ కానుందని తెలుస్తోంది.

లెవెల్ 1 ఉద్యోగులకు మాత్రం 37,554 రూపాయలవరకు డీఏ అరియర్స్ అందవచ్చని సమాచారం అందుతోంది. కేంద్రం ఈ మొత్తాన్ని ఖాతాలలో జమ చేస్తే ఉద్యోగులకు కూడా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 7వ వేతన సంఘం ప్రకారం ఈ మొత్తం ఖాతాలలో జమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మోదీ సర్కార్ ప్రస్తుతం 31 శాతం డీఏను ఉద్యోగులకు అందిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఎంతో ముఖ్యమైనది కాగా ఏడాదికి రెండుసార్లు డీఏ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అరియర్స్ చెల్లింపులకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.