Health Tips: ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది. పూర్వం రోజులకు ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పుడు సహజమైన వాతావరణం కావడంతో వారికి ఏ రకమైన వ్యాధులు రాలేదు. మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాతికేళ్లకే వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. మనం తినే ఆహారమే మనకు ప్రతిబంధకంగా మారుతోంది ఫలితంగా ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతోంది. దీంతో మనం తినే ఆహారంతో పాటు మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రతి రోజు ఉదయం నాలుగున్నరకే నిద్ర లేవాలి. లేవగానే మంచినీరు వేడిచేసుకుని తాగాలి. దీంతో మన జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. తరువాత వాకింగ్ చేయాలి. ఉదయం 8.30 గంటల లోపే అల్పాహారం తీసుకుంటే మంచిది. దీంతో మనకు శక్తి పెరుగుతుంది. రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా బ్రష్ చేసుకోవడం ఉత్తమం. ఇక మధ్యాహ్న భోజనం కూడా 1.30 గంటల లోపే ముగించాలి. మధ్యాహ్న భోజనంలో పుల్కాలు తీసుకుంటే మంచిది. ఆకుకూరలు తింటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
మధ్యాహ్నం మూడు గంటలకు టీ తాగాలి. సాయంత్రం పూట ఏదైనా స్నాక్ తీసుకోవాలి. రాత్రి పూట భోజనం సూర్యాస్తమయం చేయాలి. రోజు తగినంత నీరు తాగాలి. ఎప్పుడు కూడా తినేటప్పుడు నీరు తాగకూడదు. తినడానికి అరగంట ముందే తాగాలి. తిన్న తరువాత కనీసం గంటన్నర పాటు నీళ్లు తాగకుండా ఉంటేనే ప్రయోజనం. రాత్రి పూట తిన్నాక కనీసం ఓ అరగంట పాటు వాకింగ్ చేయాలి. దీంతో మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. తొందరగా నిద్ర వస్తుంది. దీంతో మంచి నిద్ర పడితేనే ఆరోగ్యం బాగుంటుంది.

వేపుళ్లు ఎప్పుడు తినకూడదు. సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఐస్ క్రీంల జోలికి వెళ్లకూడదు. రాత్రి పూట సలాడ్లు తినకూడదు. టీలు తాగకూడదు. మనం తినే ఆహారాల్లో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, వాల్ నట్స్ వంటివి అధికంగా తీసుకుంటే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే చెడు ఫలితాలే వస్తాయి. దీన్ని గమనించుకుని ప్రతి రోజు మన దినచర్యను మార్చుకుని సహజసిద్ధమైన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.