Upcoming SUVs: త్వరలో మార్కెట్లోకి 4 కొత్త SUVలు.. ఫీచర్స్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..

టయోటా పేరు చెప్పగానే ఇన్నోవా గుర్తుకు వస్తుంది. ఇప్పుడీ కంపెనీ కొత్తగా SUVని తీసుకొస్తుంది. అదే టేజర్. 1.0 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్, 100 బీహెచ్ పీ పవర్ తో పాటు 90 బీహెచ్ పీ పవర్ అనే రెండు ఇంజిన్ల ఆప్షన్ కలిగి ఉంది.

Written By: Srinivas, Updated On : October 26, 2023 3:23 pm

Upcoming SUVs

Follow us on

Upcoming SUVs: కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో SUVలకు డిమాండ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీలను మాత్రమే తయారు చేస్తున్నాయి. లార్జ్ స్పేస్ తో పాటు బాహుబలి ఇంజిన్ కలిగి ఆకర్షించే డిజైన్ లతో కూడిన ఎస్ యూవీలు అందుబాటులోకి ఇప్పటికే వచ్చాయి. అయితే త్వరలో మరో 4 అప్డేట్ ఫీచర్స్ తో కలిసి ఎస్ యూవీలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆ మోడల్స్ గురించి తెలుసుకుందాం..

మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి త్వరలో రాబోతుంది బొలెరో నియో ప్లస్. ఇప్పటికే నియోప్లస్ పేరుతో అంబులెన్స్ ను రిలీజ్ చేసింది. లేటేస్ట్ బొలెరో నియో ప్లస్ ఈ ఏడాది చివరినాటికి రిలీజ్ చేయనున్నారు. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగిన ఇది 120 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు టచ్ స్క్రీన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ వింగ్ మిర్రర్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

టయోటా పేరు చెప్పగానే ఇన్నోవా గుర్తుకు వస్తుంది. ఇప్పుడీ కంపెనీ కొత్తగా SUVని తీసుకొస్తుంది. అదే టేజర్. 1.0 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్, 100 బీహెచ్ పీ పవర్ తో పాటు 90 బీహెచ్ పీ పవర్ అనే రెండు ఇంజిన్ల ఆప్షన్ కలిగి ఉంది. పవర్ ట్రైనర్, డిజైన్ అన్నీ బ్రోంక్స్ వలె ఉంటాయి. మారుతి సుజుకీ ఫ్రాంటెక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ రీ బ్యాడ్జ్ మోడల్ అయిన ఎస్ యూవీ లైనప్ ను విస్తరించడానికి సిద్ధంగా ఉంది.

టాటా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పంచ్ విపరీతంగా ఆకట్టుకుంది. లేటేస్టుగా దీనిని ఎలక్ట్రిక్ వెహికల్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బహుళ బ్యాటరీ ప్యాక్ లు, అనువైన ఛార్జింగ్ లతో ఉన్న దీనిని నెక్సాన్ ఈవీ లేదా టియాగో ఈవీ మోడల్ ను పోలి ఉంటుంది. దీనిని టాటా జెన్ 2 ఈవీ అర్కిటెక్చర్ పై తయారు చేశారు,

భారత మార్కెట్లో కియా కార్లు దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ కంపెనీ నుంచి సోనెట్ ఫేస్ లిఫ్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఇది ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు బంపర్, ఎల్ ఈడీ డీఆర్ఎస్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, ఫాగ్ ల్యాంప్ లను కలిగి ఉన్నాయి. హెడ్ లైట్ యూనిట్లు ఆకర్షిస్తాయి. ఫ్రంట్ గ్రిల్ లో కొత్త ఇన్ సర్ట్ లను అమర్చారు.