Young Cricketer Heart Attack: అదేంటోగాని ఈమధ్య సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు కూడా గుండెపోటుతో మరణించారు. రీసెంట్ గా గుండెపోటుతో చనిపోయిన వారు అందరూ కూడా చాలా ఫిట్ గా ఉన్న వారే. పునీత్ నుంచి మొదలుపెడితే నిన్న షేన్ వార్నర్ వరకు అందరూ గుండెపోటుతో మరణించారు. మరీ ముఖ్యంగా క్రికెటర్లు ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు.

కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ కూడా ఇలా గుండెపోటుతో బాధపడుతూ స్టెంట్స వేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఓ 25 ఏళ్ల క్రికెటర్ కు గుండెపోటు వచ్చింది. విచిత్రమేంటంటే అతని గుండె గంటన్నరలో దాదాపు నలభై సార్లు ఆగిపోయింది. కానీ డాక్టర్లు దేవుళ్లుగా మారి అతనికి చికిత్స చేసి బ్రతికించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో నివసిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెటర్ కు ఛాతి నొప్పి వచ్చింది.
దీంతో అతన్ని కుటుంబీకులు క్లినిక్ కి తీసుకెళ్లారు. అయితే అక్కడ అతనికి సడన్ గా గుండెపోటు వచ్చి పడిపోయాడు. వెంటనే అలర్ట్ అయిన డాక్టర్లు అతనికి ప్రథమ చికిత్స అందించి ఐసియులోకి తీసుకెళ్ళేలోపే దాదాపు నలభై సార్లు గుండె ఆగిపోయింది. కార్డియాక్ మసాజ్ తో పాటు కరెంట్ షాక్ లాంటివి ఇస్తూ అతని గుండెను మళ్లీ కొట్టుకునేలా చేశారు డాక్టర్లు.
ఇక మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతని గుండెలో 80 శాతం బ్లాకేజ్ ఉన్నట్టు గుర్తించారు. సర్జరీ చేసి దాన్ని తీసేశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్యాం సోనీ ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. కాగా ఒక యంగ్ క్రికెటర్ కి హార్ట్ ఎటాక్ రావడం ఏంటంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.