Police key announcement: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం.. నెంబర్ ప్లేట్ ట్రాన్స్లేట్ చేయడం.. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వంటివి రవాణా శాఖ ప్రకారం చట్టరీత్యా నేరం. కానీ చాలామంది ఈ రూల్స్ పాటించడం లేదు. అయితే హెల్మెట్ లేకున్నా.. సరైన వయసు లేకున్నా వాహనాన్ని నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాన్ని నడపేవారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి రవాణా శాఖ ట్రాఫిక్ ఉల్లంఘాలపై జరిమానాలు విధిస్తూ వస్తోంది. అయితే గతంలో ఈ జరిమానాలపై డిస్కౌంట్ ఇచ్చేవారు. 60 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్ తో ట్రాఫిక్ చలాన్లను చెల్లించడానికి అవకాశం ఇచ్చేవారు. అయితే ఇటీవల 100% ట్రాఫిక్ చలాన్ మాఫీ అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై పోలీసులు ఏమన్నారంటే?
ఇటీవల సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్రాలు కొడుతోంది. ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి శుభవార్త అని.. ఈ చలాన్లపై 100% తగ్గింపు అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్త నిజం కాదని.. ప్రస్తుతానికి రవాణా శాఖ ఎటువంటి డిస్కౌంట్ ప్రకటించలేదని ట్రాఫిక్ పోలీస్ శాఖ తెలుపుతోంది. అయితే ఇదే రోజు కొన్ని రాష్ట్రాల్లో అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ చలాన్ లను చెల్లించేందుకు కొన్ని రకాల మిరహాయింపులు ఇచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొందరు 100% ట్రాఫిక్ చలాన్ మాఫీ అని ఫేక్ ప్రచారం చేశారు. అయితే దీనిని నమ్మవద్దని పోలీసులు తెలుపుతున్నారు.
గతంలో ఈ చలాన్లపై ట్రాఫిక్ పోలీస్ శాఖ డిస్కౌంట్ ప్రకటించింది. కానీ గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించడం లేదు. కొంతమంది ఒకవైపు జరిమానాలు విధిస్తూ.. మరోవైపు డిస్కౌంట్ ప్రకటించడం వల్ల వాహనదారుల్లో ఎటువంటి భయం ఉండదని.. దీంతో రవాణా శాఖ నియమాలు పాటించారని విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై అత్యధికంగా జరిమాణాలు విధించినా వాటి విషయంలో పోలీసు శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ విషయంలో భారీగా నిర్మాణాలు విధిస్తున్నారు. కానీ హెల్మెట్ విషయంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. అయితే చాలామంది హెల్మెట్ వాడడం లేదు. వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వాహనాల ధ్రువపత్రాలు లేని వారిని.. గడువు తీరిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.