Money Plan: నేటి కాలంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఉద్యోగం, వ్యాపారం ఏం చేసినా.. ఖర్చులకే సరిపోతున్నాయి. పొదుపు చేసేందుకు సరైన మార్గం లేకపోవడంతో చాలా మంది ఎలాంటి ఇన్వెస్ట్ మెంట్ చేయడం లేదు. అయితే చిన్నపాటి పెట్టుబడి పెడితే భవిష్యత్ లో కోట్ల రూపాయల రాబడి వచ్చే కొన్ని పథకాలు ఉన్నాయి. అలాగే రాబడితో పాటు ఇన్సూరెన్స్ కూడా కవరయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఓ వైపు ఇన్సూరెన్స్, మరోవైపు రాబడి వచ్చే ఈ పెట్టుబడి గురించి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.
కొంత మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు రాగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఇందులో పెట్టుబడి పెడితే భవిష్యత్ లో ఎప్పుడో గాని వస్తాయి. ఇప్పుడు అవసరానికి ఉపయోగపడవు. ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఆ మొత్తం వచ్చే అవకాశం లేదు. దీంతో కొన్ని కంపెనీలు ఇన్సూరెన్స్ తో పాటు రిటర్న్స్ ఇచ్చే కొన్ని పథకాలను అందుబాటులోకి వచ్చాయి. వీటిలో తక్కువ మొత్తంలో అంటే.. నెలకు రూ.10వేలు పెడితే చాలు.. భవిష్యత్ లో 2.89 కోట్ల ఆదాయం వస్తుంది. అదేంటంటే?
ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో NFO గురించి ఈ మధ్య బాగా వినిపిస్తుంది. New Fund Offer పేరుతో వచ్చిన ఇందులో పెట్టుబడి పెడితే రెండు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో భాగంగా Max Life Midcap Momentum Index అనేది యూలీఫ్ ఫండ్. అంటూ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్ మెంట్ పథకం అని గుర్తించాలి. ఎవరైతే ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ చేయని వారు.. ఎలాంటి స్కీముల్లో డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ పెట్టని వాళ్లు ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే రెండు రకాలుగా లాభాలు ఉంటాయి.
వచ్చే ఆదాయంలో ఎంత వరకు ఇన్సూరెన్స్ చేయాలని అనుకున్నామో.. ఎంతైతే పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నామో నిర్ణయించుకొని ఆ మొత్తాన్ని ఇందులో పెట్టుబడిగా పెడితే.. పెట్టుబడికి 120 రేట్ల మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అయితే ఇది పూర్తిగా మర్కెట్ పై ఆధారపడుతుంది. ఇప్పుడున్న మార్కెట్ కు , భవిష్యత్ ఇంక్రీజ్ అయితే 100 రేట్లు ఎక్కువ లాభం రావొచ్చు. అయితే అప్పటికీ డౌన్లో ఉండే మాత్రం తక్కువ మొత్తం వస్తుంది. ఉదాహరణకు నెలకు రూ.10వేలు పెడితే చాలు.. భవిష్యత్ లో 2.89 కోట్ల ఆదాయం వస్తుంది. గత పది సంవత్సరాల కిందటి నుంచి ఇప్పటి వరకు Max Life Midcap Momentum Index 21.6 శాతం పెరిగింది. అందువల్ల లాంగ్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.