Homeలైఫ్ స్టైల్AC Summer Tips: ఏసీ: 1.5 టన్ 3స్టార్.. 1.5 టన్ 5స్టార్.. దేనికి కరెంట్...

AC Summer Tips: ఏసీ: 1.5 టన్ 3స్టార్.. 1.5 టన్ 5స్టార్.. దేనికి కరెంట్ బిల్లు ఎక్కువంటే..

AC Summer Tips: ఎండాకాలం మొదలైంది. కొన్ని చోట్ల ఉష్ణగ్రతలు ఇప్పటికే పెరిగాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పటికే చాలా మంది ఫ్యాన్లు, కూలర్లు కొనుగోలు చేశారు. కొందరు ఖర్చు అయినా పర్వాలేదు అనుకొని ఏయిర్ కండిషనర్లు (ఏసీ) కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏసీని కొనుగోలు చేయడం వరకు ఓకే. కానీ ఆ తరువాత కరెంట్ బిల్లు ఎంత వస్తుందో? అన్న ఆందోళన కొంత మందిలో ఉంటుంది. చాలా మంది అవగాహనలేమి కారణంగా తమ పరిస్థితులకు భిన్నంగా ఎక్కువగా విద్యుత్ బిల్లు వచ్చే వాటిని కొనుగోలు చేసి ఆ తరువాత ఆందోళన చెందుతారు. ముందుగానే ఏ కెపాసిటీ ఏసీకి ఎంత బిల్లు వస్తుందో తెలిస్తే వాటిని వాడే విషయంలో కూడా జాగ్తత్తలు తీసుకుంటారు. మరి ఏ ఏసీకి ఎంత కరెంట్ బిల్లు వస్తుందో ఇప్పుడు చూద్దాం..

Also Read: జగన్ తో కెసిఆర్, కేటీఆర్ కటీఫ్.. అసలు విషయం చెప్పిన ఆంధ్రజ్యోతి ఆర్కే

సాధారణంగా ఏసీని కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ శాతం 1.5 టన్ కెపాసిటీని కొనుగోలు చేస్తారు. అయితే ఇందులో 3 స్టార్, 5 స్టార్ ఏసీలు కూడా ఉంటాయి. కొందరు ఏసీ టెక్నీషియన్ నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. 1.5 టన్ 5 స్టార్ ఏసీ గంటపాటు రన్ అయితే 1.5 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. 8 గంటల పాటు వినియోగిస్తే 1.5X8=12యూనిట్లు ఖర్చు అవుతుంది. ఉదాహరణకు నెల పాటు ఇదే మోతాదులో ఏసీని వినియోగిస్తే.. 12 X 30 =360 యూనిట్ల ఖర్చు అవుతుంది. ఈ యూనిట్లకు స్థానిక విద్యుత్ బిల్లుతో లెక్కిస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవచ్చు. అంటే యూనిట్ ఖర్చు రూ.7 ఉంటే రూ.2,520 వస్తుంది. ఇదే తరహాలో 3 స్టార్ ఏసీని వినియోగిస్తే.. గంటకు 1.6 X8=12.8 యూనిట్లు ఖర్చు అవుతుంది. 12.8X30=384 యూనిట్ల ఖర్చు అవుతుంది. అప్పుడు యూనిట్ ఖర్చు రూ.7 అయితే రూ.2,688 అవుతుంది.

మొత్తంగా 5 స్టార్ రేటింగ్ ఏసీతో పోలిస్తే 3 స్టార్ రేటింగ్ ఏసీకి విద్యుత్ బిల్లు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్న తరుణంలోకొందరు ఎక్కువ గంటలు విద్యుత్ వినియోగించే అవకాశం ఉంది. కానీ విద్యుత్ బిల్లును ఆదా చేయాలని అనుకుంటే మాత్రం వీటిని తెలుసుకొని పరిమితంగా వాడుకోవచ్చు. అయితే ఏసీని వినియోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏసీ టెంపరేచర్ ను ఎప్పుడూ ఒకే విధంగా ఉంచాలి. ఇది 24 నుంచి 26 సెంటిగ్రేడ్ ఏర్పాటు చేసుకవాలి. ఏసీ ఫిల్టర్లను నెలకోసారి అయినా శుభ్రం చేసుకోవాలి. ఏసీని ప్రతి రెండు గంటలకోసారి వినియోగానికి విరామం ఇవ్వాలి. ఏసీ ఆన్ చేసినప్పుడు గదిని పూర్తిగా మూసివేయాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version