
దేశంలో వైరస్ కల్లోలం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోడ్-డి అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం సంస్థ త్వరలోనే దరఖాస్తు చేయబోతోందట. ఈ నెలలోనే ఈ టీకాకు అనుమతులు లభిస్తాయని సంస్థ నమ్మకంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 28 వేల మందిపై జైకోవ్ – డి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ నెలలోనే దీనికి సంబంధించిన మధ్యంతర ఫలితాలు రానున్నాయట.