
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని ట్విట్టర్ ద్వారా షర్మిల ప్రకటించారు. హుజూరాబ్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా? అంటూ ఆమె ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా ఇవన్ని చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం అంటూ షర్మిల చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలు మాత్రమేనంటూ షర్మిల అభిప్రాయపడ్డారు.