Homeఆంధ్రప్రదేశ్‌TDP Working President Nara Lokesh : నారా లోకేష్.. ఇంతింతై.. టిడిపికి వర్కింగ్...

TDP Working President Nara Lokesh : నారా లోకేష్.. ఇంతింతై.. టిడిపికి వర్కింగ్ ప్రెసిడెంటై..

TDP Working President Nara Lokesh : రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎవరు చెప్పినా సరే వినడాన్ని అలవాటు చేసుకోవాలి. అదే ఆ నాయకుడిని గొప్పగా చేస్తుంది. ఈ సువిశాల భారత దేశంలో ఎంతోమంది నాయకులు వచ్చారు. ప్రజల మనసులు గెలిచిన వారు మాత్రమే గొప్ప నాయకులు ఎదిగారు. గొప్ప నాయకులను మాత్రమే తరాలు మారినా సరే ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు. గొప్ప నాయకులుగా ఎదగాలి అనుకునేవారు.. కచ్చితంగా గొప్ప పనులు చేయాలి. ఇప్పుడు ఈ జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే, ఏపీ మంత్రి నారా లోకేష్ చోటు సంపాదించుకున్నారు.

తెలుగుదేశం పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ను టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నారా లోకేష్ పేరును ప్రకటించడం ఒకరకంగా టిడిపి భవిష్యత్తు ముఖ చిత్రాన్ని వెల్లడించినట్టయింది.

నారా లోకేష్ కు టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం ఒక రకంగా ఆ పార్టీలో కార్యకర్తలకు ఆనందం కలిగించే విషయం. నారా లోకేష్ పొలిటికల్ ప్రవేశం వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగానే సాగింది. మొదట్లో నారా లోకేష్ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన భాషను.. మాట్లాడే విధానాన్ని అందరూ విమర్శించారు. తన తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ కు మంత్రి పదవి లభించిందని.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడు గెలవకుండానే ఆయన మంత్రి అయ్యారని వైసీపీ విమర్శించింది. చివరికి తెలుగులో కూడా సక్రమంగా మాట్లాడలేడని.. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇచ్చారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమిపాలయ్యారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఏకంగా పార్టీ కార్యాలయం పై దాడులు కూడా చేశారు. చివరికి చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు. పార్టీని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. తన తండ్రిని విడిపించుకున్నారు. యువగళం పేరుతో పాదయాత్ర చేశారు.

పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు.. నాయకులలో ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేశారు. పార్టీని యువతకు దగ్గర చేశారు. కార్యకర్తల సమస్యలను పరిష్కరించారు. అన్నిటికంటే ముఖ్యంగా మంగళగిరిలో ఓటమి తప్ప గెలుపు లేని పార్టీకి విజయాన్ని అందించారు. అంతేకాదు, మంత్రిగా తన బాధ్యతలను నూటికి నూరు శాతం సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తున్నారు. కేంద్ర పరిధిలోకి రాష్ట్ర సమస్యలను తీసుకెళ్తూ.. బడ్జెట్ కేటాయింపులలో సింహభాగం లభించే విధంగా చూస్తున్నారు. ఇన్ని రకాలుగా సానుకూలతలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నారా లోకేష్ కు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version