YouTube creators India : ఇంటర్నెట్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది కొత్త కొత్త ఉపాధిని పొందుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ ను ఆధారంగా చేసుకొని సోషల్ మీడియా ఉపయోగించి తమ జీవితాలను ఉన్నత స్థితిలో ఉంచుకుంటున్నారు. సోషల్ మీడియా అనగానే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటితో పాటు యూట్యూబ్ కూడా ప్రధానంగా నిలుస్తుంది. అయితే ఫేస్బుక్, ట్విట్టర్ అనేటివి కేవలం మెసేజ్ చేయడం.. ప్రపంచంలోని సమాచారాన్ని తెలుసుకోవడం వంటి వాటికీ మాత్రమే పనిచేస్తాయి. కానీ YouTube మాత్రం ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యకరం లేదు. ఎందుకంటే ప్రస్తుత కాలం చాలామంది ఫుల్ టైం యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు. మరి కొంతమంది పార్ట్ టైం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు సైతం యూట్యూబ్ ను ఆధారంగా చేసుకొని ఆర్థికంగా నిలదుక్కుకుంటున్నాయి. అసలు భారత్ లో యూట్యూబ్ ప్రభావం ఎంత ఉందంటే?
ఒకప్పుడు యువకులు తమ చదువు పూర్తి కాగానే జాబ్ కోసం కంపెనీల ఎదుట బారులు తీరి కనిపించేవారు. కానీ ఇప్పుడు చదువుతుండగానే చాలామంది యువకులు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి సంపాదిస్తున్నారు. ముఖ్యంగా YouTube ద్వారా చిన్నచిన్న సంపాదన మొదలుపెట్టి ఆ తర్వాత లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం భారత్ లో 9,30,000 మంది యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారంటే భారత్లో యూట్యూబ్ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ఈ సంస్థ ఎంతో ఉపయోగపడుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో యూట్యూబ్ 16 వేల కోట్ల జిడిపిని యాడ్ చేసింది. అంటే యూట్యూబ్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
మొన్నటి వరకు కొన్ని న్యూస్ మీడియా సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత దీనిని ఆధారంగా చేసుకొని అదనపు ఆదాయాన్ని పొందుతున్నాయి. టీవీల్లో ప్రసారమయ్యే వార్తలను, ప్రత్యేక కథనాలను యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నాయి. వాస్తవం ఏంటంటే టీవీల ద్వారా కంటే యూట్యూబ్ ద్వారానే ఎక్కువ మంది వీక్షిస్తున్నట్లు ఆ సంస్థలు గ్రహించాయి. దీంతో చాలా మీడియా సంస్థలు యూట్యూబ్ ద్వారా న్యూస్ ను అందిస్తున్నాయి. ఇక కొందరు న్యూస్ ఛానల్లు, ఎంటర్టైన్మెంట్ చానల్స్ పెట్టాలని అనుకునేవారు యూట్యూబ్ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. తమ ప్రతిభను యూట్యూబ్ ద్వారా చూపించడంతో చాలామంది ఆసక్తిగా ఈ ఛానల్ ను అభివృద్ధి చేస్తున్నారు
అయితే అన్ని ఛానళ్లు అభివృద్ధి చెందుతున్నాయని అనుకోవడం లేదు. యూట్యూబ్ సంస్థ సైతం పగడ్బందీగా ఉంటూ నిజాయితీగా, ప్రతిభ ఉన్న వారిని మాత్రమే ప్రోత్సహిస్తుంది. అందులోనూ ఫేక్ వీడియోస్, కాఫీ వీడియోస్ కు కాకుండా నిజమైన వీడియోస్ కు మాత్రమే ఎంకరేజ్మెంట్ ఇస్తూ వారికి డబ్బులను చెల్లిస్తోంది. భవిష్యత్తులో మరింతమంది యూట్యూబ్ పైనే ఆధారపడి తమ జీవితాలను కొనసాగించే అవకాశం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.