Bhimavaram: భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజు రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేసే ఆగడాలకు అంతులేకుండాపోతోంది. నారాయణ కాలేజీ విద్యార్థులు బస్సులో వెళుతుండగా ఆకతాయిలు ఓ విదార్థిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి బస్తీకి వచ్చి తనను ఎందుకు కొట్టారని ప్రశ్నించాడు. దీంతో ఆకతాయిలందరూ ఆ విద్యార్థిపై మూక్కుమ్మడిగా దాడిచేశారు. ఈ క్రమంలో ఆ విదార్థి బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. తర్వాత ఆకతాయిలు మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం చేశారు.
మద్యం మత్తులో యువకుల వీరంగం..
భీమవరంలో కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిపై దాడి. యువకులు సృష్టించిన అలజడికి భయబ్రాంతులకు గురైన వాహనదారులు.
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు. pic.twitter.com/E6mHbiMv4W— ChotaNews App (@ChotaNewsApp) June 20, 2025