27 న రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బంద్ ను ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే ఇక్క అసలు విషయం ఏమిటంటే వ్యవసాయచట్టాలను పార్లమెంట్ లో ఆమోదం పొందటానికి వైసీపీ అనుకూలంగా ఓటు వేసింది. రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణ మెజార్జీ రాలేదు. వైసీసీ, బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీల మద్దతు కావాలి. వైసీపీ ఈ విషయంలో మద్దతు తెలిపింది. అయితే ఇప్పడు బయట ఆ చట్టాలను తాము వ్యతిరేకమని ప్రకటనలు చేస్తోంది.
రైతుల బంద్ కు మద్దతిస్తోంది. కేంద్రంలో వ్యవసాయ బిల్లులతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతిచ్చిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో ఆ అంశాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పుకుంటోంది. తాజాగా వైసీపీ సర్కార్ రేపు రైతు సంఘాల సమస్య అయిన వ్యవసాయ బిల్లులు, కార్మికులు వ్యతిరేకిస్తున్న వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వ్యవహారాలపై భారత్ బంద్ కు మద్దతు పలికింది. ఎన్డీయే సర్కార్ తో జగన్ సంబంధాలు 2019 నుంచి కొనసాగుతున్నాయి.
పార్లమెంటులోని కీలక బిల్లుల విషయంలో జగన్ కేంద్రానికి చాలా సార్లు మద్దుతు ఇచ్చారు. అయితే ఇప్పడు వ్యవసాయ బిల్లులకు జగన్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయడంతో వైసీపీ తన డబుల్ గేమ్ ను బయటపెట్టుకుందన్న వాదన వినిపిస్తోంది. కేంద్రంతో గొడవ జరిగితే కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో ఏపీ ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఇటు రాజకీయ ప్రయోజనాలను కూడా వైసీపీ లెక్కలు వేసుకుంటోంది.