
ప్రముఖ వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. కరోనా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. కరోనా పూర్తిగా తగ్గినప్పటికీ దాని ప్రభావం వల్ల ఆరోగ్యం క్షిణించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ నుండి 2సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్గా ఉన్నారు. వీఎంఆర్డీఏకు తొలి చైర్మన్గా ఆయన రికార్డులకు ఎక్కారు.ఆయన పలువురు మృతికి సంతాపం తెలుపుతూ.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.