
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైకాపా ఆధిక్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం 15 ఓట్లు పోలవగా.. అందులో వైకాపా 11, తెదేపా, నోటాకు ఒక్కో ఓటు వచ్చాయి. మరో 2 ఓట్లు చెల్లలేదు. మరికాసేపట్లో 8 డివిజన్ల ఫలితాలు వెల్లడించనున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలోని 4 కేంద్రాల్లో లెక్కింపు చేపడుతున్నారు. ఒక్కో డివిజన్ కు ఒక్కో లెక్కింపు టేబుల్ కేటాయించారు.