Xiaomi Redmi A7 Pro : భారతదేశంలో షియోమి కంపెనీకి చెందిన మొబైల్స్ అందరిని ఆకట్టుకుంటాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉంటూ వినియోగదారులకు అవసరమైన ఫీచర్లను ఈ మొబైల్స్ అందిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటికే ఎన్నో మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ కంపెనీ లేటెస్ట్ గా Redmi A7 Pro అనే మొబైల్ లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ కంటే ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా నీటి తరం వారు కోరుకునే నాణ్యమైన కెమెరాతో పాటు బ్యాటరీ వ్యవస్థ ఇందులో బలంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Xiaomi కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎన్నో మొబైల్స్ వచ్చినప్పటికీ ఇందులో A సిరీస్‌లో ఇప్పటివరకు ప్రో మోడల్ రాలేదు. అయితే ఇప్పుడు ఆ మొబైల్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మొబైల్ లో 6.9 అంగుళాల డిస్ప్లే చూడొచ్చు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. మొబైల్స్ లో సినిమాలు చూసేవారు.. గేమింగ్ ఆడే యూత్ కు ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే 8000 nits బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. దీంతో ఎలాంటి వాతావరణంలోనైనా అద్భుతమైన కాంతిని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఆపరేటింగ్ సిస్టం 3.0 ద్వారా పనిచేసే ఇందులో ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
నేటి తరం అన్ని వర్గాల వారు కోరుకునేది మొబైల్ లో మంచి కెమెరాలు. ఇలాంటి వారికి ఈ మొబైల్ లో అద్భుతమైన కెమెరాను సెట్ చేశారు. బ్యాక్ సైడ్ 32 మెగాపిక్సల్ తో నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం 8 ఎంపీ పనిచేస్తుంది. సోషల్ మీడియా కంటెంట్లు సృష్టించే వారికి ఈ కెమెరా చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొబైల్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉండి ప్రీమియం లుక్ ను అందిస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 6300 mAh సెటప్ చేశారు. ఈ బ్యాటరీ కి 15 వార్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇంతలో రివర్స్ చార్జింగ్ ద్వారా చిన్నచిన్న వాటిని రీఛార్జ్ చేసుకోవచ్చు.
మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా షియోమీ ఫోన్లో మార్కెట్లోకి వస్తాయని చాలామంది భావన. అందుకు అనుగుణంగానే రెడ్మి A 7 ప్రో కూడా అందుబాటు ధరలోనే ఉంది. ఈ మొబైల్ ను రూ.12,499 ప్రారంభ ధర నుంచి. రూ.13,499 వరకు విక్రయిస్తున్నారు. అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉండగా క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది.
