
ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే అటల్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే, మనాలీ-లేహ్ మధ్య ప్రయాణ దూరం 46 కిలోమీటర్లు తగ్గనుంది. దీనితో ప్రయాణ కాలం సుమారు 5 గంటలు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఈ సొరంగాన్ని ప్రారంభించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. అటల్ టన్నెల్ పొడవు 9.02 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగం.