
భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్టింగ్ కోచ్ అభయ్ శర్మను బీసీసీఐ తప్పించింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టు సభ్యులతో పాటు సహాయక సిబ్బంది కూడా బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బయోబబుల్ లోకి మంగళవారం లోగా అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అభయ్ ఇంకా జట్టుతో చేరకపోవడంతో ఆయనను తొలగించినట్లు తెలిసింది. త్వరలోనే ఫీల్డింగ్ కోచ్ ను ఎంపిక చేస్తామని బోర్డు వర్గాలు వెల్లడించాయి.