women reservation bill : కిరణ్ రిజిజు కొన్నాళ్లక్రితం తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో అత్యంతకీలకమైన బిల్లు ప్రవేశపెడుతున్నాం అని సంచలన ప్రకటన చేశారు. ఇంకేముంది దీనిపై ఎన్నో ఊహాగానాలు చేశారు. నార్త్ బెంగాల్ ను యూనియన్ టెరిటరీ చేస్తారని..యూసీసీ బిల్లు తెస్తారని ఎన్నో వార్తలు స్ప్రెడ్ చేశారు. మొత్తం మీద ఈరోజు స్పష్టత వచ్చింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని.. 50 శాతం మహిళలకే సీట్లు ఇవ్వాలని అమిత్ షా పార్లమెంట్ లో ప్రకటించడం సంచలనమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏముందంటే జనగణన అయిన తర్వాత డీలిమిటేషన్ అయ్యాక మహిళా రిజర్వేషన్లు చేస్తామని ప్రకటించారు.
సూత్రబద్దంగా తప్పులేదు. కానీ 2029 ఎన్నికల నాటికి ఈ మహిళ రిజర్వేషన్ అమలు కాదు. ఈ ప్రాసెస్ కు లేట్ అవుతుంది.
ఎన్నికలకే మహిళా రిజర్వేషన్ సీట్ల పెంపు అమలుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
