
విజయనగరంలోని పోలీస్ శిక్షణ కళాశాల క్వార్టర్స్ లో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మహిళ ఎస్సై కె. భవాని (25) ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఎస్సైగా పని చేస్తున్న భవాని.. క్రైమ్ శిక్షణ నిమిత్తం ఐదు రోజుల క్రితం విజయనగరం వచ్చారు. శనివారం మధ్యాహ్నానికి శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో భవాని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.