
ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు మనుషుల క్రూరత్వానికి ఆద్దం పడుతున్నాయి. వింటేనే ఒళ్లు జలదరించే ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఒక మహిళ నిండు గర్భిణి పొట్ట కోసి ఆమె కడుపులోని బిడ్డను తన బిడ్డగా చూపించే ప్రయత్నం చేసింది. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ మహిళ పేరు టేలర్ పార్కర్. పోలీసులు దారుణ ఘటనపై కేసు నమోదు చేసి టేలర్ ను అరెస్ట్ చేశారు. టేలర్ కొన్ని రోజుల క్రితం వరకు ఒక కేసులో టెక్సాస్ లోని జైలులో శిక్ష అనుభవిస్తూ ఉండేది.
క్రూరమైన స్వభాగం కలిగిన టేలర్ ను ఆమె కుటుంబ సభ్యులు 5 మిలియన్ డాలర్లు పూచీకత్తుగా పెట్టి బెయిల్ పై విడుదల చేయించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే టేలర్ మరో దారుణానికి పాల్పడి పొట్టలోని బిడ్డను తీసుకెళ్లింది. ఆ తరువాత ఆ బిడ్డను మరో ఆసుపత్రికి తనకు పుట్టిన బిడ్డగా తీసుకెళ్లి తనకు రోడ్డు పక్కన డెలివరీ అయిందని డాక్టర్లను కట్టుకథలు చెప్పింది. అయితే ఆమె ప్రవర్తన, మాటలపై డాక్టర్లకు అనుమానం వచ్చింది.
వాళ్లు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు మహిళ గురించి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. టేలర్ పార్కర్ ఉంటున్న ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో చనిపోయిన మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బెయిల్ పై విడుదలైన ఆమెను పోలీసులు జైలుకు తరలించి విచారిస్తున్నారు.
ఈ ఘటన టెక్సాస్ ప్రాంతంలో కలకలం రేపుతోంది. సదరు మహిళను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అమాయకుల ప్రాణాలు తీసే టేలర్ లాంటి వాళ్లకు బెయిల్ మంజూరు చేయకూడదని కోరుతున్నారు.