అధికార బీజేపీపై కాసుల వాన!

అధికారం బెల్లం లాంటిది. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టే.. దేశంలో అధికారంలో ఉండే పార్టీ చుట్టే కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్లు తిరుగుతారు. వారికి కోట్ల విరాళాలు పంచుతారు. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీపై అదేస్థాయిలో కనకవర్షం కురుస్తోందని తెలిసింది. Also Read: ఇక చైనావోడికి బ్యాండ్ బాజే! మోడీ మదిలో మరో అస్త్రం దేశంలో అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా ఉంది. అందుకే 2019 ఎన్నికల వేళ దేశంలో రాజకీయ […]

Written By: NARESH, Updated On : October 16, 2020 2:02 pm
Follow us on

అధికారం బెల్లం లాంటిది. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టే.. దేశంలో అధికారంలో ఉండే పార్టీ చుట్టే కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్లు తిరుగుతారు. వారికి కోట్ల విరాళాలు పంచుతారు. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీపై అదేస్థాయిలో కనకవర్షం కురుస్తోందని తెలిసింది.

Also Read: ఇక చైనావోడికి బ్యాండ్ బాజే! మోడీ మదిలో మరో అస్త్రం

దేశంలో అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా ఉంది. అందుకే 2019 ఎన్నికల వేళ దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో మెజార్టీ బీజేపీకే దక్కాయి. ఈ మేరకు కిందటి ఆర్ధిక(2018-9) సంవత్సరంలో జాతీ పార్టీల ఆదాయ మార్గాలు, ఇతరత్రా వివరాలలకు సంబంధించి ‘పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్)’ సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు మొత్తం రూ.876 కోట్లు విరాళంగా అందగా.. ఆ విరాళాల్లో దాదాపు 92శాతం బీజేపీకే వచ్చాయని ఏడీఆర్ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది.

దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు మొత్తం రూ.876 కోట్లు విరాళంగా అందగా.. అందులో బీజేపీకే కనక వర్షం కురిసింది. ఆ తర్వాత కాంగ్రెస్ కు విరాళాలు అందాయి. కానీ బీజేపీ పోల్చితే చాలా చాలా తక్కువ. ఇందులో బీజేపీకే రూ.698 కోట్లు రాగా.. రెండో స్థానంలో కాంగ్రెస్ కు 122.5 కోట్ల విరాళాలు దక్కాయని రిపోర్టులు చెబుతున్నాయి. బీజేపీకి 1573మంది కార్పొరేట్ దిగ్గజాలు విరాళాలు ఇవ్వగా.. కాంగ్రెస్ కు 122మంది కార్పొరేట్స్ విరాళాలు ఇచ్చారు.

Also Read: రైతులకు కేంద్రం శుభవార్త.. సులభంగా లక్షా 60 వేల రుణం!

ఇక జాతీయ పార్టీల్లో బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఎన్సీపీకి అత్యధిక విరాళం అందాయి. ఆ పార్టీకి 11.34 కోట్లు విరాళంగా అందాయి. ఇక కొంతమంది పాన్ కార్డులు, అడ్రస్ డీటైల్స్ ఇవ్వకుండా విరాళాలు అందించారు.. ఇవి 13.36 కోట్లు జాతీయ పార్టీలకు అందాయి.