
తనికాకు సేకరణ కోసం భర్త, గ్రామస్తులతో కలిసి వెళ్లిన ఓ మహిళ పై చిరుతపులి దాడి చేసి చంపేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని జిల్లా కియోలరీ బ్లాక్ రతన్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రతన్ పూర్ గ్రామానికి చెందిన45 ఏండ్ల మహిళ తన భర్తతో పాటు మరికొందరు గ్రామస్తులతో కలిసి తునికాకు సేకరణ కోసం సమీప అడవిలోకి వెళ్లింది. అక్కడ తునికాకు సేకరిస్తుండగా సదరు మహిళపై చిరుతపులి దాడిచేసింది. అంతేగాక ఆమెను అర కిలోమీటర్ దూరం లాక్కెళ్లి చంపేసింది.