https://oktelugu.com/

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్ తో మహిళ మృతి

నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండల కేంద్రానికి చెందిన మేక పద్మ (56) బ్లాక్ ఫంగస్ తో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సదరు మహిళకు ఈ నెల మొదటి వారంలో కరోనా పాజిటివ్ రాగా వారం రోజుల్లో కోలుకున్నారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమెకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కన్పించడంతో కుంటుబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు బ్లాక్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 23, 2021 / 06:46 PM IST
    Follow us on

    నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండల కేంద్రానికి చెందిన మేక పద్మ (56) బ్లాక్ ఫంగస్ తో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సదరు మహిళకు ఈ నెల మొదటి వారంలో కరోనా పాజిటివ్ రాగా వారం రోజుల్లో కోలుకున్నారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమెకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కన్పించడంతో కుంటుబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్ లోని గాంధీ దవాఖానకు రిఫర్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు ఆమెను నవీపేటకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందారు.