
కోవిడ్ కల్లోల సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. ఆక్సిజన్ లేకపోవడంతో కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడదామని సుప్రీం కోర్టు పిలుపునిచ్చింది. అధికారులను జైలుకు తరలించడం వల్ల ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ రాబోదని తెలిపింది. మే 1 నుంచి డిల్లీ నగరానికి సరఫరా చేసిన ఆక్సిజన్ వివరాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీ హైకోర్టు మంగళవారం జారీ చేసిన కోర్టు ధిక్కార హెచ్చరికపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అపీలును సుప్రీం కోర్టు బుధవారం విచారించింది.