
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ప్రకంపనలు రేగుతున్నాయి. చిన్నారి చైత్ర కుటుంబాన్ని తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 కోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే ఇట్లా ఉంటే.. ఇక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని నిలదీశారు.