బార్లు పబ్ లు ఎందుకు నిషేధించరు: హైకోర్టు

తెలంగాణలో కరోనా కేసులు, టెస్టులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అస్సలు కరోనా పరీక్షలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పేరుతో స్కూళ్లకు సెలవు ప్రకటించి బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలుపాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు, నియంత్రణపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇందులో కరోనా వ్యాధి నిర్ధారణను ఖచ్చితంగా నిర్ధారించే ‘ఆర్టీపీసీఆర్’ […]

Written By: NARESH, Updated On : April 6, 2021 12:49 pm
Follow us on

తెలంగాణలో కరోనా కేసులు, టెస్టులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అస్సలు కరోనా పరీక్షలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పేరుతో స్కూళ్లకు సెలవు ప్రకటించి బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలుపాలని హైకోర్టు ఆదేశించింది.

తాజాగా తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు, నియంత్రణపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇందులో కరోనా వ్యాధి నిర్ధారణను ఖచ్చితంగా నిర్ధారించే ‘ఆర్టీపీసీఆర్’ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని.. పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు 10శాతం కూడా లేవని ధర్మాసనం ఎండగట్టింది.

రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే తెలంగాణ సర్కారు పరీక్షలు చేయకపోవడం ఏంటని ఏజీని హైకోర్టు నిలదీసింది. నెమ్మదిగా వీటిని పెంచుతున్నామన్న ఏజీ వివరణను తోసిపుచ్చింది. వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది.

ఇక వివాహాలు, అంత్యక్రియల్లో జనాలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్, మరణాలు రేటు తెలిపి.. చికిత్స కేంద్రాలపై అవగాహన పెంచాలని 48 గంటల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.