రైతుబిడ్డ రమణ సుప్రీం సీజేఐ ఎలా అయ్యాడు?

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా పొన్నవరం గ్రామానికి చెందిన ఒక రైతు బిడ్డ జస్టిస్ ఎన్వీ రమణ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎలా ఎదిగాడు? ఆయన ఎక్కడ చదివాడు? బాల్యం విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు.? ఆయన ప్రస్థానం ఎలా సాగిందనే దానిపై స్పెషల్ ఫోకస్.. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితమే ఆమోదముద్ర […]

Written By: NARESH, Updated On : April 6, 2021 12:25 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా పొన్నవరం గ్రామానికి చెందిన ఒక రైతు బిడ్డ జస్టిస్ ఎన్వీ రమణ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎలా ఎదిగాడు? ఆయన ఎక్కడ చదివాడు? బాల్యం విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు.? ఆయన ప్రస్థానం ఎలా సాగిందనే దానిపై స్పెషల్ ఫోకస్..

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితమే ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ కావడం విశేషం. అంతకుముందు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటికీ జస్టిస్ ఎన్వీ రమణకు తెలుగు వ్యక్తి మరో అవకాశం దక్కడం విశేషం.

*ఎన్వీ రమణ బాల్యం, చదువు
జస్టిస్ ఎన్వీ రమణ పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా పొన్నవరం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో.. తల్లిదండ్రులు ఎన్.గణపతిరావు-సరోజినిలు. 1957 ఆగస్టు 27న ఆయన జన్మించారు. కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అమరావతిలోని ఆర్.వి.వి.ఎన్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ చేశారు. 1982లో నాగార్జున యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై, న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

*న్యాయవాదిగా ప్రస్థానం..
2000 జూన్ 27న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా, ఉమ్మడి ఏపీకి అదనపు అడ్వకేట్ జనరల్ గా బాధ్యతలు నిర్వహించారు. సివిల్, క్రిమినల్ చట్టాలతోపాటు రాజ్యాంగపరమైన అంశాల్లో జస్టిస్ ఎన్వీ రమణ దిట్టగా పేరుంది.

*ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ముద్ర
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువతి హత్యను సుమోటాగా స్వీకరించి విచారించి సంచలనం సృష్టించారు. అదనపు కోర్టుల ద్వారా నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టారు. న్యాయవ్యవస్థలో అత్యాధునిక సాంకేతిపరిజ్ఞానం ఉపయోగించి ఢిల్లీ హైకోర్టులో ఈ-ఫైలింగ్ ను ప్రారంభించారు.

ఇప్పుడు సుప్రీంకోర్టులో సీనియర్ గా.. న్యాయకోవిదుడిగా మారి అత్యున్నత పీఠాన్ని మన తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ అధిరోహించాడు.