మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం రద్దు చేయడం పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం పై ముంబైలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మరాఠా సమాజ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని ఆమోదించిందని అన్నారు. అయితే ప్రధానికి రాష్ట్రపతికి మాత్రమే ఇలాంటి చట్టాలు చేసే అధికారం ఉందని, మహారాష్ట్రకు అధికారం లేదని సుప్రీం వ్యాఖ్యనించినట్లు ఉద్ధవ్ ప్రస్తావించారు. మహారాష్ట్రాలో మరాఠా సమాజానికి రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది.