
తూత్తుకుడి కాల్పుల వ్యవహారంపై నటుడు రజనీకాంత్ ను తప్పకుండా విచారిస్తామని విచారణ కమిషన్ న్యాయవాది అరుల్ వడివేల్ శేఖర్ స్పష్టం చేశారు. తూత్తుకుడి స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణకు మాజీ న్యాయమూర్తి అరుణాజగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిసన్ ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు 27 విడతలుగా కమిషన్ విచారించింది.