Bandi Sanjay: జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం.. బండి సంజయ్

రాష్ట్రంలో 2023 లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే యూపీ మాదిరిగా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు.. అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి సంగారెడ్డిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. యూపీలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తే కేసీఆర్ మాత్రం మత పరమైేన […]

Written By: Suresh, Updated On : September 8, 2021 10:14 am
Follow us on

రాష్ట్రంలో 2023 లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే యూపీ మాదిరిగా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు.. అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి సంగారెడ్డిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. యూపీలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తే కేసీఆర్ మాత్రం మత పరమైేన రిజర్వేషన్ బిల్లు తేవాలని చూశారని విమర్శించారు.

కారు టీఆర్ఎస్ ది.. నడిపిస్తున్నది మాత్రం రజాకార్.. బెంగళూరు ఎంపీ తేజస్వీ

సంజయ్ చేసేది పాదయాత్ర కాదని, కేసీఆర్ పై దండయాత్ర అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. కారు టీఆర్ఎస్ దే అయినా నడిపిస్తున్నది రజాకార్ అని విమర్శించారు. భూ వివాదాన్ని ఆసరాగా చేసుకుని జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం ఘటనలో 15 మంది సాధువులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సంజయ్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.