Taliban Unveils New Cabinet: కొలువుదీరిన అప్ఘన్ ప్రభుత్వం.. ప్రధాని, హోమంత్రి ఎవరో తెలుసా.?

Taliban Unveils New Cabinet: అప్ఘానిస్తాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. గత నెలలో దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు ఇక పాలన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పాలనలో ముఖ్య వ్యక్తులను నియమించుకున్నారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్ పేరును ప్రకటించుకున్నారు. ఉప ప్రధానిగా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరును ప్రస్తావించారు. వీరిద్దరు తాలిబన్ల వ్యవస్థ స్థాపనలో ముఖ్యులుగా ఉన్నారు. అయితే మొన్నటి వరకు బరాదర్ దేశానికి నేతృత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా మహహ్మద్ హసన్ […]

Written By: NARESH, Updated On : September 8, 2021 12:01 pm
Follow us on

Taliban Unveils New Cabinet: అప్ఘానిస్తాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. గత నెలలో దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు ఇక పాలన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పాలనలో ముఖ్య వ్యక్తులను నియమించుకున్నారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్ పేరును ప్రకటించుకున్నారు. ఉప ప్రధానిగా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరును ప్రస్తావించారు. వీరిద్దరు తాలిబన్ల వ్యవస్థ స్థాపనలో ముఖ్యులుగా ఉన్నారు. అయితే మొన్నటి వరకు బరాదర్ దేశానికి నేతృత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా మహహ్మద్ హసన్ పేరును ఫైనల్ చేశారు. దీంతో మహహ్మద్ హసన్, అబ్దుల్ ఘనీ బరాదర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అసలు వీరు ఎలా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు..? ఇంత ఎత్తుకు ఎలా ఎదిగారు..?

దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న ముల్లా మహమ్మద్ హాసన్ అఖుండ్ తాలిబన్ గ్రూపులో ముఖ్యుడిగా ఉన్నారు. ఈయన అత్యంత శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారని ది న్యూస్ లోని ఓ నివేదిక పేర్కొంది. రెహబరి షురా అనేది అగ్ర నాయకుడి ఆమోదానికి లోబడి గ్రూపు వ్యవహారాలన్నింటినీ నడిపే మంత్రి వర్గం వలె పనిచేస్తుంది. అందులో అఖుండ్ ప్రధానంగా ఉంటాడు. ఇక హసన్ జన్మస్థలం కాందహార్. గతంలో సోవియట్ కు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఈయన 20 సంవత్సరాలుగా రెహబరి షురా అధిపతిగా పనిచేశాడు. తాలిబన్ అగ్రనాయకుడు ముల్లా హెబతుల్లాకు అత్యంత సన్నిహితుడు . అప్ఘనిస్థాన్ లో 1996 నుంచి 2001 వరకు అధికారంలో ఉన్న తాలిబన్ల పాలనలో ఉప ప్రధానిగా పనిచేశాడు. హెబతుల్లాకు అత్యంత సన్నిహితుడుగా అఖుండ్ ఉండడంతో ఆయన పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే తాలిబన్ల చీఫ్ హిబతుల్లా అఖుంజాదా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించలేదు.

ఇక తాలిబన్ల పాలనకు ఉప ప్రధానిగా ఉండబోతున్న అబ్ధుల్ ఘనీ బరాదర్ తాలిబన్ సహా వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ఉరుజ్గాన్ ప్రావిన్స్ లో అతడు 1968లో జన్మించాడు. అయితే పెరిగి పెద్దదైంది మాత్రం కాందహార్లో. 1980లో సోవియట్ దళాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బరాదర్ పాల్గొన్నాడు. ఆ సమయంలో ముజాహిదీన్ దళంలో చేరాడు. 1989లో సోవియట్ ఉప సంహరణ తరువాత ముజాహిదిన్ కమాండర్లు భూభాగాల నియంత్రణ పోరాడడంలో దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. దీంతో బరాదర్ కాందహార్ కు వెళ్లి అక్కడ ముల్లా ఒబమర్ తో కలిసి మతపరమైన పాఠశాలను స్థాపించాడు. ఆ తరువాత తాలిబన్ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడానికి ఒమర్ కు సహాయం చేశాడు. 2019 నుంచి ఖతర్ రాజధాని దోహాలోని తాలిబన్ల రాజకీయ కార్యాలయానికి నాయకత్వం వహించాడు. 2001లో తాలబన్లు అధికారం కోల్పోయినప్పుడు అతడు రక్షణ శాఖ డిప్యూటీ మంత్రిగా ఉన్నాడు. యూఎస్ దాడుల తరువాత పాకిస్థాన్ పారిపోయాడు.

ప్రధాని, ఉప ప్రధాని పదవులు చేపట్టనున్న ఇద్దరూ గత తాలిబన్ల ప్రభుత్వంతో పనిచేసిన వారే. 1991 నుంచి 2001 వరకు అప్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న సమయంలో వీరు కీలక పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు దేశానికి నేతృత్వం వహిస్తున్నారు. తాలిబన్ల వ్యవస్థ లో వీరి పాత్ర కీలకంగా ఉండడంతో పాటు అమెరికా లాంటి దేశాలకు వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఏర్పడనున్న ప్రభుత్వంలోని వారు సైతం పోరాట పటిమ ఉన్నవారే. త్వరలో పాలన సాగించనున్న తాలిబన్ల గురించి పలు దేశాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం తాలిబన్లు తమ ఆగడాలనుకొనసాగిస్తూనే ఉన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని చంపేస్తున్నారు. అయితే అధిష్టాన నాయకులు మాత్రం శాంతి మంత్రం జపిస్తున్నారు. వీరి పాలనలో కొత్త మార్పలు వస్తాయా..? పాత నిబంధనలే పాటిస్తారా..? అని అనుకుంటున్నారు.