
టీ20 వర్డల్ కప్ టీంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ కు చోటు దక్కడం పలువురిని ఆశ్చర్యపర్చింది. అశ్విన్ చివరిసారిగా 2017లో టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి టెస్టులకే పరిమితం అయ్యాడు. అయితే ఐపీల్ లో మంచి ఆటతీరు కనబరుస్తుండటం వల్లే అతడికి చోటు ఇచ్చినట్లు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చెప్పారు. యూఏపీ లో ఆఫ్ స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని.. వాషింగ్టన్ సుందర్ కు గాయం కావడంతో అశ్విన్ ను తీసుకున్నామని తెలిపారు.