
ఎవరైనా మంత్రి పనితీరు బాగోలేకపోతే, అలాంటి అంశాలను ప్రధానమంత్రి చూసుకుంటారు. అంతే కానీ, న్యాయస్థానాలు ఏమీ చేయలేవని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ అధికార నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి కేంద్రమంద్రి వీకే సింగ్ తన ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.