
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెంచులు సాగు చేసుకుంటున్న అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ అధికారులపై గిరిజన రైతులు దాడి చేసి పెట్రోల్ పోశారు. శుక్రవారం మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులను చెంచులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చెంచులకు, అధికారులకు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కొంత మంది రైతులు వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను అధికారులపై పోశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడటంతో వారు శాంతించారు.