
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు నెలకొన్నప్పటికి 1.5 శాతం మేర వృద్ధి రేటు నమోదు చేసినట్లు ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. సంక్షేమ పథకాలు, దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గౌతం రెడ్డిని ఐపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమన్నారు.