DK Shivakumar: సీఎం కుర్చీ పై తాజాగా డీకే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుర్చీ దొరికితే వదలొద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరులో న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ చాలా మంది లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా అందులో కూర్చోవట్లేదు. కానీ మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కూర్చీని సంపాందిచడం అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికితే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోవద్దు అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి డీకే, సిద్ధరామయ్య ల మధ్య కుర్చీలాట మొదలైన సంగతి తెలిసిందే.
సీఎం కుర్చీ కోసం మేము తీవ్ర పోరాటాలు చేస్తున్నాం
కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు.. కానీ ఒకసారి కుర్చీ దొరికితే దాన్ని వదలొద్దు – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్ https://t.co/SFAT18iYd5 pic.twitter.com/d5ixC3ODjj
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2025