
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ పిర్జాదా షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. గత మార్చిలో నిశ్చితార్థం కూడా జైపూర్ వేదికగా ఘనంగా జరిగింది. కాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహరీన్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక నుంచి భవ్య బిష్టోయ్, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ స్పష్టం చేసింది.