War 2 full story : మరో నాలుగు రోజుల్లో ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ యాక్షన్ చిత్రం ‘వార్ 2′(War 2 Movie) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే చాలా వచ్చాయి. టీజర్, ట్రైలర్, చిన్న చిన్న యాక్షన్ బిట్ ప్రోమోలు ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ చిత్రం లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు ‘వార్ 2’ మూవీ స్టోరీ ఏంటి ?, ఈమధ్య కాలం లో స్పై యూనివర్స్ లో వచ్చే సినిమాల స్టోరీలు మోత ఒకేలా ఉంటున్నాయి. ‘పఠాన్’ మూవీ స్టోరీ తీసుకుంటే నిజాయితీగా పనిచేసే ఒక వ్యక్తిని, మన ఇండియన్ స్పై పాకిస్తాన్ టెర్రరిస్టులకు కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో వదిలేస్తారు.
అప్పటి నుండి పగ పెంచుకున్న ఆ స్పై మన దేశానికీ శత్రువుగా మారిపోతాడు, అతని నుండి మన దేశాన్ని కాపేడేవాడిగా పఠాన్ వస్తాడు. ‘వార్ 2’ స్టోరీ కూడా ఇలాగే ఉంటుందని, ఎన్టీఆర్ మన దేశానికీ శత్రువుగా మారిపోతాడని, అతన్ని అడ్డుకోడానికి హృతిక్ రోషన్ వస్తాడని, ఇలా పలు రకాల కథనాలు మనం సోషల్ మీడియా లో చాలానే చూశాము. అయితే అసలు స్టోరీ అది కాదట. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారు. ఒకే తండ్రికి పుడతారు కానీ, తల్లులు వేరే. అంటే సవతి కొడుకుల మధ్య పోరు అన్నమాట. వీళ్ళ మధ్య శత్రుత్వం కలగడానికి కారణాలు ఏంటి?, ఎన్టీఆర్ వైపు న్యాయం ఉంటుందా?, లేదా హృతిక్ రోషన్ మధ్య న్యాయం ఉంటుందా?, చివరి పోరులో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు వంటి అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఫ్యాన్స్ కచ్చితంగా థ్రిల్ కి గురయ్యే అంశాలు ఈ చిత్రం లో చాలానే ఉంటాయట.
ఇకపోతే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే ఒక పాట కూడా హైలైట్ గా నిలుస్తుందని టాక్. ‘సలాం అనాలి’ అంటూ సాగే ఈ పాటకు సంబందించిన ప్రోమో ని రీసెంట్ గానే మేకర్స్ విడుదల చేశారు. ఫ్యాన్స్ పూర్తి పాట కోసం ఎదురు చూస్తున్నారు కానీ, అది కేవలం వెండితెర మీద మాత్రమే చూడాలట. ఈ పాట ‘నాటు నాటు’ ని మించి ఉంటుందని, థియేటర్స్ లో ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబందిచిన అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో తప్ప, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. ఆశించిన స్థాయిలో అయితే లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతున్నాయి చూడాలి.