
కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో జరిగిన ఘర్షణకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరడం వల్ల కక్ష్యతో ఎమ్మెల్యే దాడి చేయించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అది కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూర్ లో తనపై ఎమ్మెల్యేగా పోటీ చేసి తనకు వచ్చే ఓట్లలో పావలా శాతం ఓట్లు విష్ణు వర్ధన్ తెచ్చుకున్నా తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.