Visakhapatnam : ఓకే అనే పదం కొన్ని విషయాలలో తీరని అనర్ధాన్ని తెచ్చిపెడుతుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో.. ఆ స్టేషన్ మాస్టర్ కు, రైల్వే శాఖకు అనుభవంలోకి వచ్చింది. దీనికి సంబంధించి ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. 2011, అక్టోబర్ 12న ఆయన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని దుర్గ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నారు. మొదట్లో వారి దాంపత్యం సాఫీగానే సాగింది. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు ఆ స్టేషన్ మాస్టర్ విధుల్లో ఉండగా ఆయన భార్య ఫోన్ చేసింది. వాగ్వాదానికి దిగింది. దీంతో అతడు.. ఆవేశంలో ” ఓకే.. మనం కలిసి మాట్లాడదాం.. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని చేద్దాం” అని అతడు చెప్పాడు. అది పెద్ద నేరం కాకపోయినప్పటికీ.. ఆ మాట ఘోరం కాకపోయినప్పటికీ.. అది అతడి జీవితాన్ని సమూలంగా మార్చింది. రైల్వే శాఖకు తీరని నష్టాన్ని చేకూర్చింది. తన భార్యతో ఆ స్టేషన్ మాస్టర్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు.. మరో చేతిలో రేడియో ట్రాన్స్మిషన్ పట్టుకుని ఉన్నారు. ఆ సందర్భంలో మరో స్టేషన్లోని స్టేషన్ మాస్టర్ కు “ఓకే” అనే పదం వినిపించింది. దానిని అతడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. గూడ్స్ రైలు ను పంపించడానికి ఓకే చెప్పాడని అనుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ రైలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మీదుగా బయలుదేరింది. అయితే ఆ రైలును రాత్రి పరిమితులను ఉల్లంఘించి పంపించినందుకు… అనధికారిక మార్గంలో ప్రయాణం సాగించినందుకు రైల్వే శాఖ మూడు కోట్లను అపరాధ రుసుముగా చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఆ స్టేషన్ మాస్టర్ ను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. దీంతో ఆ స్టేషన్ మాస్టర్ కు కోపం తారస్థాయికి చేరింది.. ఈ వివాదానికి కారణమైన తన భార్య నుంచి విడాకులు కావాలని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. మరోవైపు అతని భార్య కూడా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. భర్త, కుటుంబ సభ్యులు హింసకు గురి చేస్తున్నారని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. ఇక సుప్రీంకోర్టు ఈ కేసును దుర్గ్ ఫ్యామిలీ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది.. అయితే అక్కడ విడాకుల పిటిషన్ ను ఆ కోర్టు తిరస్కరించింది. దీంతో స్టేషన్ మాస్టర్ చత్తీస్ గడ్ హై కోర్టును ఆశ్రయించారు. దాదాపు 12 సంవత్సరాలు ఎదురు చూస్తే.. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఆమె ప్రవర్తన తో..
స్టేషన్ మాస్టర్ భార్య వివాహం జరిగిన తర్వాత కూడా.. తన ప్రియుడితో సంబంధం కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా స్టేషన్ మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులపై అదనపు కట్నం, వహింస ఆరోపణలు చేసింది. ఈ విషయం కోర్టు విచారణలో తేలింది..” ఆమె ప్రవర్తన బాగోలేదు. అత్యంత దారుణంగా ఉంది. ఆమె విచక్షణను ప్రతి సందర్భంలోనూ కోల్పోతోంది. అది అంతిమంగా స్టేషన్ మాస్టర్ విధి నిర్వహణపై ప్రభావం చూపించింది. ఆమె మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు స్టేషన్ మాస్టర్ జీవితాన్ని ప్రభావితం చేశాయి. అతడు మానసిక శోభకు గురికావడంలో ప్రముఖ పాత్ర వహించాయి. ఆ రైలు ఘటన కు ప్రధాన కారణం స్టేషన్ మాస్టర్ భార్య అనడంలో సందేహం లేదు. అందువల్ల ఈ ఘటనకు ఆమె బాధ్యత వహించాలని” హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Visakhapatnam station master faced problems due to his wife to say ok word
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com