Vinutha Kota: శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ వినూత కోట ను డ్రైవర్ మర్డర్ కేసు ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ చేశారు. శ్రీమతి వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచారు. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు అయిన విషయం పార్టీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో శ్రీమతి వినుత కోటను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఓక ప్రకటనలో తెలిపారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ గా ఉన్న వినుతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జనసేన పార్టీ నుండి వినూత కోట సస్పెండ్
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ వినూత కోట డ్రైవర్ మర్డర్ కేసు ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన https://t.co/uhbu3lHfQq pic.twitter.com/lzxbOxXv2Q
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2025