
తెలంగాణలో ప్రజలకు రక్షణ కల్పించేలేని సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సింగరేణి కాలనీలో హత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా కేసీఆర్ కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ఆయనకు ఓట్లు, సీట్లు తప్ప ప్రజల కష్టాలు పట్టవని దుయ్యబట్టారు. కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలో కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు.