
ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం పై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాలే నిదర్శనమన్నారు. భూమిలమ్మి వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమాకూర్చుకోవడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.