దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ శ్రీ రాజారాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలను ఈ నెల 7నుండి ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్జిత సేవలను నిలిపివేసిన విషయం విదితమే. కేంద్రం యొక్క అన్ లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు ఆర్జీత సేవలలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. రాజన్నకు ప్రీతికరమైన కోడె మొక్కుతో పాటు సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వగా అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజలకు అనుమతి నిరాకరించారు.