Vellore Cow Attack: వేలూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. వేలూరు బస్టాండ్ సమీపంలోని లక్ష్మీ కేఫ్ వద్ద ఆవులు దాడి చేయడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై ఆవులు ఒక్కసారిగా దాడికి పాల్పడటంతో ఈ అనూహ్య ఘటన జరిగింది. దాడిలో గాయపడిన వారిని వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
వేలూరులో ఆవుల దాడి.. ఒకరు మృతి.
వేలూరు బస్టాండ్ దగ్గర లక్ష్మీ కేఫ్ సమీపంలో ఆవులు దాడి చేసిన ఘటన దారుణంగా మారింది.
ఈ దాడిలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. pic.twitter.com/8afu7VLhmD
— greatandhra (@greatandhranews) June 26, 2025