
ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ మరోసారి టీమ్ ఇండియాను ఎగతాళి చేశాడు. మహిళల క్రికెట్ జట్టును ప్రశంసిస్తూ కోహ్లీసేనపై వెటకారం గుప్పించాడు. కనీసం ఒక భారత జట్టైనా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో పోరాడుతోందని ట్వీట్ చేశాడు. భారత మహిళ జట్టు ఈ రోజు అద్భుత పోరాటం చేసింది. ఇంగ్లిష్ పరిస్థితుల్లో కనీసం ఒక భారత జట్టైనా ఆడటం చూస్తుంటే బాగుంది.. అని ట్వీట్ చేశాడు.