
మార్కెట్లోకి మరో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. జైడస్ కాడిలా సంస్థ తయారు చేసిన జైకోవ్ -డి ఈనెల 15 నుంచి బహిరంగ మార్కెట్లోకి రానుంది. ఇది సూది రహిత వ్యాక్సిన్. ఫార్మా జెట్ అనే పరికరాన్ని చర్మంపై ఉంచి నొక్కడం వల్ల టీకా శరీరంలోకి వెళ్తుంది. ఈ వ్యాక్సిన్ ను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండగా.. జైకోవ్-డిని 12 ఏళ్లు దాటిన వారూ పొందవచ్చు.